రైతు సమాఖ్య పిటిషన్లకు విచారణ అర్హత ఉంది

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలని రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున వేసిన పిటేషన్లకు విచారణ అర్హత ఉందని గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. రెండు సంఘాల్లోని రైతులందరూ కోర్టు ఫీజ్ చెల్లించాలని ఆదేశించింది. 10 రోజుల్లో కోర్టు ఫీజ్ చెల్లించిన తరువాత విచారణ చేస్తామని హైకోర్టు చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.