మీకు దణ్ణం పెడుతున్నా మా సమస్య పరిష్కరించండి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత ఉండాలి. పరిసరాల శుభ్రతపై అగాహన పెంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి. కాని జీవన పోరాటంలో ప్రతి ఒక్కరూ తలమునకలైపోతున్నారు. అందుకే పరిసరాల శుభ్రతను పట్టించుకునే వారే కరువయ్యారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా తన కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఓ పదేళ్ల బాలుడు అధికారులకు తమ గోడు చెప్పుకున్నాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఐదో తరగతి స్టూడెంట్ తమ కాలనీలో సరైన రోడ్డు లేదని నివాస ప్రాంతాల దగ్గర మొలసిన పిచ్చి చెట్లను తొలగించాలని వేడుకోవడం అందర్ని ఆలోచింపజేస్తోంది. అసలు అతనికి ఈ ఆలోచన రావడానికి కారణం ఏమిటంటే.

పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియాలోని ఎన్టీపీసీ గౌతమీనగర్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కేశవ ఉదయం తెల్లవారు జామునే తమ కాలనీలోని రోడ్డుపై భైటాయించాడు. వేకువ జామునే నిద్ర లేచి నిత్యం రన్నింగ్ చేసే అక్క ఆసుపత్రి పాలు కావడం తట్టుకోలేకపోయిన కేశవ..తమ ప్రాంతంలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగినా తొలగించే వారు లేరంటూ దాని వల్ల తన సోదరికి వాకింగ్ చేస్తుండగా విష కీటకం కరిసి అనారోగ్యం పాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని కాలనీ వాసులంతా ఎదుర్కొంటున్నారని గమనించగలరంటూ బల్దియా అధికారులతో తన గోడు చెప్పుకున్నాడు. రోడ్డు బాగా లేకపోవడంతో కేవలం తమ కుటుంబమే కాదని కాలనీలో నివాసం ఉంటున్న చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వెంటనే రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నాడు కేశవ. కనీసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలనయినా తొలగించినా బావుంటుందని అంటున్నాడు. దీనివల్ల కీటకాలు మొక్కల మధ్య అవాసం ఏర్పాటు చేసుకుని కాలనీ వాసులకు ప్రాణాపాయంగా మారినందున మొక్కలనయినా తొలగిస్తే బావుంటుందని కాలనీ వాసులు కూడా చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.