మునుగోడు ఉప ఎన్నిక గెలుపులో పోచారం భాస్కర్‌రెడ్డి కీలక పాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఆదివారం మద్యాహ్నం తేటతెల్లమైంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన ప్రత్యర్ది, భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదిలా ఉండగా ప్రభాకర్‌రెడ్డి గెలుపుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాబినెట్‌ మంత్రులు, నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న వ్యక్తులు గ్రామస్థాయిలో ఎంపీటీసీ నుండి మొదలుకుని ఎమ్మెల్యే, మంత్రులు తమ తమకు కేటాయించిన మండలాలు, ఎంపీటీసీ స్థానాల వారీగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇదిలా ఉండగా మంత్రులకు కేటాయించిన స్థానాల్లో బీజేపి పార్టీ అభ్యర్థికి మెజార్టీ రాగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మెన్‌ పోచారం భాస్కర్‌రెడ్డికి ఎన్నికల ప్రచారానికి కేటాయించిన మునుగోడు నియోజకవర్గం చిన్నకొండూరు ఎంపీటీసీ పరిధిలోని గ్రామాల్లో పోచారం భాస్కర్‌రెడ్డి తన అనుచరులు బాన్సువాడ నియోజకవర్గం నుండి భారీగా నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను అక్కడకు పిలిపించుకుని విస్తృతంగా అధికార తెరాస పార్టీ బలపరిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.

ఆయనతో పాటు నియోజకవర్గ తెరాస శ్రేణులు చేసిన కృషికి ఫలితంగా తెరాస బలపరిచిన అభ్యర్థి ప్రబాకర్‌రెడ్డికి చిన్నకొండూర్‌ మండలం గూడెం గ్రామ పరిధిలో 642 ఓట్ల మెజార్టి రావడం వారి పనితీరుకు నిదర్శనం. ఓ విధంగా చెప్పుకోవాలంటే మునుగోడు ఉప ఎన్నికలో తనవంతుగా డీసీసీబీ చైర్మెన్‌ భాస్కర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలుస్తుంది.

ఎన్నికల లెక్కింపు మొదలుకుని చివరి వరకు ఉత్కంఠ రేపిన ఉప ఎన్నిక ఫలితాల్లో నువ్వా నేనా? అన్నట్లు భాజపా, తెరాస అభ్యర్థులు పోటాపోటీ నెలకొంది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపులో బాన్సువాడ నియోజకవర్గం సైతం కీలకపాత్ర పోషించింది. దీంతో తెరాస పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.