కవులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి

రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య

తెలంగాణ కళా సంఘం, బీసీ టీచర్స్ యూనియన్, కళా సూర్య కల్చరల్ ఆర్గనైజేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనం సభికులను మంత్రం ముగ్దులను చేసింది. విద్యానగర్ లోని బీసీ భవన్ లో సుతారపు వెంకట నారాయణ, అనుముల ప్రబాకర్ సారద్యం లో జరిగిన  ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి ప్రముఖ రచయిత దాశరధి పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కవులు బడుగు బలహీన వర్గాల వారు నిష్పక్షపాతంగా ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమ స్ఫూర్తిని నింపాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమ స్ఫూర్తితో సంఘటితంగా పోరాడాలని మన హక్కులు వేరే వారికి పొందకుండా అంకితభావం కనబరిచారని అన్నారు. ఈ సందర్బంగా కవులు జాతీయ వాదం గాంధీజీ,లాల్ బహదూర్ శాస్త్రి, జాతీయత, తెతెలంగాణా రాష్ట్రం, బతుకమ్మ, లపై చక్కని కవితలు వినిపించారు. కవుల మాదిరిగానే  బీసీల కోసం నా వంతు పోరాటం చేస్తున్నారని అన్నారు. అనంతరం ముఖ్యఅతిథి ఆర్ కృష్ణయ్యను పలువురు కవులు ఆత్మీయంగా ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కౌలుతోపాటు డాక్టర్  కీర్తి పురస్కార గ్రహీత రఘుశ్రీ సాహితి ప్రముకులు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్,డాక్టర్ నాళేశ్వరం శంకరం తో పాటు పాతిక మంది కవులు పాల్గొని చక్కని కవితలు వినిపించారు.

Leave A Reply

Your email address will not be published.