బండి సంజయ్ కారులో పోలీసుల తనిఖీలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు పలుమార్లు తనిఖీ నిర్వహించారు. సోమవారం రాత్రి మర్రిగూడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తుండగా. ఒక గంట సేపటి వ్యవధిలో మూడుసార్లు బండి సంజయ్ వాహనాలు పోలీసులు తనిఖీ నిర్వహించారు. తంగేడుపల్లి, పుట్టపాక, చల్మెడ గ్రామాల్లో బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేశారు.