స్కూల్ విద్యార్థినిపై పోలీస్ కీచకపర్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్య ప్రదేశ్ భోపాల్ లో ఒక పోలీస్ బైక్ పై వెళ్తూ.. రోడ్డు మీద నడుస్తున్న అమ్మాయికి అడ్డంగా బైక్ ఆపాడు. ఆమెను ఇష్టానుసారంగా టచ్ చేస్తూ ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ విద్యార్థిని తప్పించుకునేందుకు ప్రయత్నించినా కూడా బలవంతంగా ఆమెపై లైంగిక దాడి చేశాడు.ఈ సంఘటన మొత్తాన్ని కూడా దూరం నుండి ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ విషయాన్ని కూడా పోలీస్ పట్టించుకోకుండా విద్యార్థిపై లైంగిక దాడిని కంటిన్యూ చేయడం జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి రక్షణ కల్పించాల్సింది పోయి తానే కీచకుడిగా మారిన వైనం ప్రస్తుతం విమర్శలకు తెర తీస్తోంది. విద్యార్థినిని లైంగికంగా వేధించిన పోలీస్ పై చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.