అసద్ ను ఎంకౌంటర్ చేసిన పోలీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉమేశ్ పాల్ హత్య కేసులో భాగంగా.. గురువారం అతీక్‌ అహ్మద్‌ను విచారణ నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపర్చారు. అదే సమయంలో పోలీసులు భారీ ట్విస్ట్ ఇచ్చారు. అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్లో అసద్‌ను పోలీసులు ఫినిష్ చేశారు.

బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్యకేసులో.. ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌‌ను ఫిబ్రవరి 24న దారుణంగా చంపేశారు. ఆయనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని కూడా పట్టపగలే కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.ఉమేశ్ పాల్ భార్య జయ పాల్‌ ఫిర్యాదుతో ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసు నమోదు చేశారు. ఉమేశ్ పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు.

అయితే.. ఈ హత్య తర్వాత అసద్‌, అతీక్‌ అనుచరుడు గుల్హామ్‌ అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులు వీరి కోసం గాలింపు చేపట్టారు. వీరిపై రూ.5లక్షల చొప్పున రివార్డులు ప్రకటించారు. ఈ క్రమంలోనే అసద్, గుల్హామ్ ఝాన్సీలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఈ సమయంలో.. అసద్, గుల్హామ్ పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో.. అసద్, గుల్హామ్ చనిపోయారు.

Leave A Reply

Your email address will not be published.