వైశాలి కిడ్నాప్ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం నవీన్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడ నుండి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా 3 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి నవీన్ ను పోలీసులు విచారించనున్నారు. శనివారం అతనిని పోలీసులు అదుపులోకి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు విచారించనున్నారు. ఈ విచారణలో భాగంగా ప్రధానంగా కీలక విషయాలను రాబట్టడంతో పాటు కిడ్నాప్ సీన్ ను రీకన్ స్ట్రక్షన్ చేయనున్నారు. కాగా ఇప్పటికే కోర్టు నిందితుడు నవీన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.

గతేడాది బొంగుళూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలితో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వైశాలి ఫోన్ నెంబర్ తీసుకున్న నవీన్ తరచూ కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. కాస్త పరిచయం పెరగడంతో ఆమెతో కలిసి నవీన్ ఫోటోలు తీసుకున్నాడు. ఈ క్రమంలో వైశాలిని పెళ్లి చేసుకోవాలనే ఆశ నవీన్ లో పుట్టుకొచ్చింది. దీనితో వైశాలి ముందు నవీన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే వైశాలి తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని నవీన్ కు చెప్పింది. ఈ క్రమంలోనే వైశాలిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు నవీన్ చెప్పుకొచ్చాడు. కానీ వైశాలి తల్లిందండ్రులు మాత్రం నవీన్ తో పెళ్ళికి ససేమిరా అన్నారు. ఇది మనసులో పెట్టుకున్న నవీన్ వైశాలి తల్లి దండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశాడు. ఆ ఖాతాలో గతంలో వైశాలితో దిగిన ఫోటీలను నవీన్ వైరల్ చేశాడు. అలాగే వైశాలి ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకున్న నవీన్ గణేష్ నిమజ్జనం సందర్బంగా వైశాలి ఇంటి ముందు స్నేహితులతో కలిసి నానా హంగామా చేశాడు. దీనిపై యువతి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

డిసెంబర్ 9న వైశాలికి మరో యువతితో నిచ్చితార్ధం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న నవీన్ పక్కా ప్లాన్ వేశాడు. యువతిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు, టీ షాప్ లో పని చేసే యువకుల సాయంతో యువతి ఇంటికి చేరుకున్నాడు నవీన్. ఇంటి ముందు కార్లను ధ్వంసం చేసి వైశాలి కుటుంబసభ్యులను కొట్టి వైశాలిని ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డివిఆర్ లను కారులో ఎత్తుకెళ్లాడు. కారులో నల్గొండ వైపు వెళ్తున్న నవీన్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి నల్గొండ వద్ద నవీన్ రెడ్డి, అతని స్నేహితులు కారు దిగి వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.