రాజకీయాలంటే వ్యాపారం కాదు

- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజకీయాలంటే వ్యాపారం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. కమిషన్‌గా తాను ఏరోజూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. కమిషన్ తీసుకున్నానని ఎవరైనా అంటే రాజకీయాల నుంచి తక్షణం రిటైర్ అవుతానని అన్నారు. తన చిన్ననాటి ముచ్చట్లు, తన అభిరుచులు, ఇవాల్టి రాజకీయాలతో సహా పలు ఆసక్తికరమైన విషయాలను ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.హిందీ, మరాఠీ, ఆంగ్లంలో తన ప్రసంగిస్తుంటానని, ప్రజలు తన ప్రసంగాలను యూట్యూబ్‌లో వింటుంటారని గడ్కరి తెలిపారు. అమెరికాలో ఎక్కువ మంది తన ప్రసంగాలు వింటుంటారని, ప్రతి నెలా యూట్యూబ్ నుంచి తనకు రూ.3 లక్షల వరకూ వస్తుందని చెప్పారు. భగవంతుడికి తనపై ఎంతో కరుణ ఉందని అన్నారు. ఏమాటైనా ముక్కుకు సూటిగా చెప్పడానికే తాను ఇష్టపడతానని తెలిపారు. ఉద్యోగం చేయడం కంటే, పదిమందికి ఉద్యోగం కల్పించాలనే ఆలోచన తనకు చిన్నప్పటి నుంచి ఉందని, తన తల్లిదండ్రులు లాయర్‌గా చూడాలని కోరుకున్నప్పుడు తాను ఇదే విషయం వారికి చెప్పానని గుర్తుచేసుకున్నారు. కులం, మతం, భాష పేరుతో ఎవరూ గొప్పవాళ్లు కారని, ప్రవర్తన-లక్షణాల వల్లే ఎవరైనా గొప్పవాళ్లవుతారని అన్నారు.

కుల రాజకీయాలకు వ్యతిరేకం

కులం గురించి తాను ఎప్పుడూ మాట్లాడనని, తాను ఒక నేతనని, తనకు అన్ని కులాల ఓట్లు కావాలని. అందరూ తనకు సోదరులైనని అన్నారు. కులం గురించి మాట్లాడే వాళ్లను దూరంగా ఉంచమని తాను చెబుతుంటానని తెలిపారు. ఇవాళ తాను ఎలాంటి బిజినెస్ చేయడం లేదని, ఇంతవరకూ చేసిన బిజినెస్ రెండున్నర వేల కోట్ల టర్నోవర్ ఉంటుందని చెప్పారు. తాను బిజినెస్ ప్రారంభించినప్పుడు 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చానని, వారిలో కనీసం 200 మంది తన కులానికి చెందిన వారు కారని అన్నారు. ఇవాళ రాజకీయాల్లో తమ వారికే టిక్కెట్లు ఇచ్చేకునే పరిస్థితి ఉందని సూటిగా చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.