పొంగులేటి వర్సెస్ సండ్ర.. పేలుతున్న పొలిటికల్ పంచ్ లు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పొంగులేటి సుధాకర్రెడ్డి. బీఆర్ ఎస్ నుంచి కొంతకాలంగా దూరంగా ఉంటున్న ఆయన.. ఆ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతానికి పొంగులేటి ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ లేకపోయినా.. షర్మిల మాత్రం తమ పార్టీలో చేరతారని.. ‘అన్న’ చెప్పారు అని ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇదిలావుంటే.. పొంగులేటి దూకుడుకు బీఆర్ ఎస్ నాయకులు కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. పొంగులేటిపై విమర్శలు చేశారు.పొంగులేటి పార్టీని ముంచేశారని.. కేసీఆర్ ఆయనను నమ్మితే.. ఆయన పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యా నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాక రేపాయి. ఇదంతా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక బీఆర్ ఎస్ అధిష్టానం చేయించిందని మీడియాకు స్వయంగా పొంగులేటి చెప్పుకొచ్చారు.అయితే.. ఇది పెద్దగా ప్రచారంలోకి రాలేదు. సండ్ర చేసిన వ్యాఖ్యలే హైలెట్ అయ్యాయి. దీంతో తన ఇమేజ్ను కాపాడుకునేందుకు పొంగులేటి ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ క్రమంలోనే తన అనుచరులు కొందరిని రంగంలోకి దింపారు. వారితో సండ్ర వెంకట వీరయ్య సహా.. బీఆర్ ఎస్పై తీవ్ర విమర్శలు చేయించారనే టాక్ నడుస్తోంది.  మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సహా మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబులు మీడియా ముందుకు వచ్చి.. బీఆర్ ఎస్ కు భారీ కౌంటర్లే ఇచ్చారు. ‘అన్న చిటికేస్తే మాస్’ అన్నట్టుగా.. పొంగులేటి కన్నెర్ర చేస్తే.. మీరంతా మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు.అంతేకాదు..  పొంగులేటి నిర్వహించిన సత్తుపల్లి ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయిందని అందుకే ఎమ్మెల్యే సండ్రకు నిద్రపట్టడం లేదని వారు వ్యాఖ్యానించారు. వెన్నుపోటు  రాజకీయాలు సండ్రకు తెలిసినంతగా పొంగులేటికి తెలియని అన్నారు.
త్వరలోనే సండ్ర అక్రమాల చిట్టాను బయట పెడతామని పొంగులేటి అనుచరులు హెచ్చరించారు.  వచ్చే ఎన్నికల్లో పొంగులేటి సునామీ లో బీఆర్ఎస్ పార్టీ కొట్టుకుపోతుందని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి పొంగులేటి వర్సెస్ సండ్ర  రాజకీయం సరికొత్త మలుపులు తిరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.