మోదీ ప్రభుత్వ అరాచకాలకు చిట్టాను ట్వీట్‌ చేసిన ప్రశాంత్‌ భూషణ్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సర్కారు చేయని అరాచకం లేదు, పాల్పడని దుర్మార్గం లేదు. ప్రజలు ఎన్నుకున్న బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ప్రతిపక్ష పార్టీలను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నది.ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌.. ‘ఈక్వాలిటీ బిఫోర్‌ లా..?’ అనే శీర్షికతో మోదీ ప్రభుత్వ అరాచకాలకు సంబంధించిన చిట్టాను ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో నారాయణ్‌ రాణే, పశ్చిమబెంగాల్‌లో సువేంధు అధికారి, అసోంలో హిమాంత బిశ్వశర్మ తదితర నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి మోదీ సర్కారు ఎలా దారికి తెచ్చుకున్నదో అందులో వివరించారు. దానికి ‘హౌ ద మోదీ గవర్నమెంట్‌ మిస్‌ యూజెస్‌ ద ఏజెన్సీస్‌ టు టాపిల్‌ గౌట్స్‌, ఇండ్యూస్‌ డిఫెక్షన్స్‌ అండ్‌ హరాస్‌ అప్పొజిషన్‌’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్‌ రీట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.