బడ్జెట్ ప్రకారం ధరలు పెరిగేవి- తగ్గేవి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే ఏడాదే ఎన్నికలు ఉండడంతో ఈసారి మోడీ సర్కార్ జనాలకు వాతలు పెట్టకుండా వారికి ఊరటనిచ్చే బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో కొంత జాగ్రత్త పడింది. మెజార్టీ ప్రజలు వాడే వస్తువుల ధరలు తగ్గించింది. విలాస వస్తువులపై ధరలు పెంచేసింది.ప్రభుత్వం తాజాగా కొన్నింటిపై దిగుమతి సుంకాల రాయితీ కల్పించి వాటి ధరలు తగ్గేలా చేసింది. మరికొన్నింటిపై పన్ను భారం వేయడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి.కేంద్రబడ్జెట్ 2023 ప్రకారం.. ఏయే వస్తువల ధరలు తగ్గుతాయి.వేటిపై భారం పడనుందనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం.. కెమెరా లెన్సులపై కస్టమ్స్ సుంకంపై ఏడాది పాటు మినహాయింపును ఇచ్చారు. టీవీ పార్టులపై ప్రస్తుతం ఉన్న శాతం కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించారు. దీంతో వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. వెండిపై దిగుమతి సుంకాన్ని పెంచడంతో దాని ధర పెరుగనుంది. లిథియం అయాన్ బ్యాటరీలకు అవసరమైన సామాగ్రిపైనా కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. రొయ్యల ఆహార ఉత్పత్తుల దిగుమతిపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు. దీంతో దేశీయంగా తయారు చేసే వాటి ధరలు తగ్గుతాయి.

*బడ్జెట్ ప్రకారం ధరలు పెరిగేవి ఇవే

బంగారం, ప్లాటినం వస్తువులు, వెండి ఉత్పత్తులు,రాగి, తుక్కు,సిగరెట్లు,టైర్లురబ్బరు,ఎలక్ట్రిక్ చిమ్నీలు

*బడ్జెట్ ప్రకారం ధరలు తగ్గేవి ఇవే

మొబైల్, ల్యాప్ టాప్, డీఎస్ఎల్ఆర్ ల కెమెరా, లెన్సులు,టీవీ ప్యానెల్ పార్టులు,లిథియం ఆయాన్ బ్యాటరీలు,ఎలక్ట్రిక్ వాహనాలు,దేశీయంగా ఉత్పత్తి చేసే రొయ్యల ఆహారండైమండ్ ల తయారీ వస్తువులు  

Leave A Reply

Your email address will not be published.