ఈశాన్య భారత్ కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన  ప్రధాని మోదీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈశాన్య భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం నుంచి గౌహతి-న్యూ జల్‌పైగురి మార్గంలో నడుస్తోంది. ఈశాన్య ప్రాంత ప్రజలు రైల్వే ప్రయాణంలో ఆనందాన్ని పొందేందుకు తీసుకున్న చర్యలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అస్సాంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేశారని ప్రభుత్వ అధికారి తెలిపారు. అత్యాధునిక వందేభారత్ రైలును ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. బొంగైగావ్-దుద్నోయి-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా విద్యుద్దీకరించిన రైలు మార్గాలను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.

Leave A Reply

Your email address will not be published.