స్వర్ణకార కుటుంబాల అభివృద్ధికి ప్రధాని మోడీ ముద్ర లోన్ తో బాటలు

- ఇండియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కేఎస్ సుధాకర్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ముద్ర లోన్లు ఇండియన్ బ్యాంక్ సహకారంతో  20 బ్రాంచ్ లో 5 లక్షల రూపాయలు చొప్పున ముద్ర కిషోర్ యోజన లోన్లను ఇవ్వదం జరిగిందని ఇండియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ కె ఎస్ సుధాకరరావు తెలిపారు. స్థానిక సంఘాల సహకారంతో లోన్లు ఇప్పించడమే కాకుండా  చెల్లించడంలోనూ బాధ్యతగా వ్యవహరించి 96% పైగా ఇఎంఐలు చెల్లిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం సభ్యులకు ఇండియన్ బ్యాంక్ మరింత అండదండగా ఉంటుందని సుధాకరరావు అన్నారు . సోమవారం  చెన్నైలో చీఫ్ జనరల్ మేనేజర్ కే ఎస్ సుధాకరరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా  రాజమండ్రి రాయలసీమ అమరావతి జోన్లలో ఈ ప్రక్రియ ప్రారంభించడానికి సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ఇప్పటికే దాదాపు 130 కోట్లు ముద్ర లోన్ ద్వారా స్వర్ణకారులకి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకులలో 23 పట్టణాల్లో ముద్ర లోన్ ప్రక్రియ ప్రారంభించామని భవిష్యత్తులో పూర్తిగా స్థానిక సంఘాలకే మానిటరింగ్ ద్వారా అన్ని బ్యాంకులు స్వర్ణకారులకు అందించే దిశగా స్థానిక సంఘాలతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. జిల్లాలు పెరిగినందువల్ల ఆగస్టు సెప్టెంబర్ నెలలో జిల్లా స్వర్ణకార సంఘాలు నూతనంగా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.