వాయిదా పడ్డ ప్రధాని మోడీ పర్యటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19న హైదరాబాద్‌లో పర్యటించాల్సి ఉంది. వందేభారత్‌ రైలుతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ పర్యటన వాయిదా పడినట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు సమాచారం ఇచ్చారు. కొత్త షెడ్యూల్ త్వరలోనే తెలియజేస్తామంటూ వివరించారు.

హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి పరుగులు పెట్టనున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి 19న ప్రారంభించాల్సి ఉంది. అదే రోజు సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్టేషన్ సికింద్రాబాద్ ను 699 కోట్ల రూపాయల వ్యయంతో పనరాభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. అయితే ఇందుకోసం గుత్తెదారు ఎంపిక అక్టోబరులోనే పూర్తి అయింది. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారని షెడ్యూల్‌ను ముందుగా ప్రకటించారు. కానీ సడెన్‌గా పర్యటన వాయిదా పడింది.

Leave A Reply

Your email address will not be published.