ఆంధ్రప్రదేశ్ లోని గ్రామపంచాయతీలను రక్షించండి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లోని గ్రామపంచాయతీలను రక్షించండి అంటూ ఆంధ్రప్రదేశ్ సర్పంచులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం నందు పంచాయతీ రాజ్ శాఖ కేంద్ర అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ కలిసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు (సర్పంచ్ లు ) కలిసి విన్నవించుకున్నారు. కేంద్ర పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ గారు ఆదేశాల ప్రకారం అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జీవన్ భారత్ భవన్ లో గల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వారితో సమావేశం ఐనారు. ఈ సమావేశంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు సంయుక్త కార్యదర్శి మమత, విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన 15 వ ఆర్థిక సంఘం నిధులు 2022-2023 వ ఆర్థిక సంవత్సరానికి రెండో విడత 988 కోట్లు విడుదల చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగినది. అట్లానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే 15 వ ఆర్థిక సంఘం నిధులను డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా గ్రామపంచాయతీలు మరియు స్థానిక సంస్థల ఖాతాలలోనే వేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగే 40% పనులు గ్రామపంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే జరగాలని నిధులు గతంలో కూడా అలా జరిగిందని ఆ నిధులను కూడా డైరెక్టర్ గ్రామపంచాయతీ ఖాతాల్లోనే వేసి సర్పంచ్ ఆధీనంలో వాళ్లకి చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది కేంద్ర పంచాయతి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ మాట్లాడుతూ మీరు ఇచ్చిన వినతి పత్రం పరిశీలించి త్వరగా చర్యలు తీసుకుంటామని మా ఉన్నతాధికారులతో కూడా చర్చించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి ఎంక్వయిరీ నిమిత్తం ఆదేశాలు పంపిస్తామని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా విద్యుత్ బకాయిల కింద చెల్లించమని మేము ఎక్కడా చెప్పలేదని కూడా తెలిపారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు కేవలం గ్రామపంచాయతీ సర్పంచి ఆధ్వర్యంలోనే ఖర్చు చేయాలని, గ్రామ సభ, సర్పంచి తీర్మానం తోనే ఏ ఒక్క ప్రతి పైసా కూడా ఖర్చు పెట్టాలని చెప్పి క్లియర్ గా ఈ సమావేశంలో ఉన్నత ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు తెలపడం జరిగింది అదేవిధంగా సర్కులర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో ఇస్తామని కూడా తెలిపారు. విద్యుత్తు బకాయిల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను డైరెక్ట్ గా విద్యుత్ సంస్థలకు చెల్లించడం చట్ట వ్యతిరేకం అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముల్లంగి రామకృష్ణారెడ్డి,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రెటరీ కొత్తపు ముని రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ రాష్ట్ర సంయుక్త సెక్రటరీ గొల్ల మాల్యాద్రి నాయుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి దాడి ఎరుక నాయుడు తదితరులు పాల్గొనడం జరిగినది.

 

 

Leave A Reply

Your email address will not be published.