అసెంబ్లీ లో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు 

- మాజీ మంత్రి ఈటల రాజేందర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీ లో ప్రజా సమస్యలను చర్చకు రావడం లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 20 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అంటే చిన్నచూపన్నారు. సమస్యను తెలిపేలోగానే మైక్ కట్ చేస్తున్నారని ఈటల పేర్కొన్నారు.కాగా అసెంబ్లీ లో బీజేపీ కి గది కేటాయించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతూ… అసెంబ్లీలో టిఫిన్ చేయడానికి కూడా తమకు రూం లేదని అన్నారు. రూం కూడా కేటాయించకపోవడం ఎమ్మెల్యేలను అవమానించడమే అని తెలిపారు. తాము కార్లలో కూర్చుంటున్నామని అన్నారు. ‘‘అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు ఆఫీస్ కేటాయించాలి. ముగ్గురు ఎమ్మెల్యేలం ఉన్నాము కానీ మాకు ఆఫీస్ ఇవ్వడం లేదు. కనీసం యూరినల్స్ కు వెళ్లేందుకు కూడా మాకు వెసులుబాటు లేదు. ఇంత అవమానమా?. ఈ విషయంపై స్పీకర్‌ను అర డజను సార్లు కలిశాం. ఏదైనా సమస్యపై కూర్చుని మాట్లాడేందుకు ఒక రూం ఇయ్యరా. బీజేపీ సభ్యులను బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్‌కు కూడా పిలుస్తలేరు. గతంలో సీపీఐ, సీపీఎం, ఒక్కొక్క సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీకి పిలిచారు. ఇది అన్యాయం కాదా?’’ అంటూ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.