అమెరికా నుంచి అధునాతన డ్రోన్ల కొనుగోలు!..

-  మోదీ యూఎస్ పర్యటనకు ముందు కీలక పరిణామం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు కీలక ఒప్పందం జరిగింది. అమెరికా తయారీ అత్యాధునిక ఆర్మ్‌డ్ ఎంక్యూ-9బీ సీగార్డియన్ డ్రోన్స్  కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. జనరల్ ఆటోమిక్స్ తయారు చేసిన దాదాపు 3 బిలియన్ డాలర్లు విలువైన 31 డ్రోన్ల కొనుగోలు చేయనున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చేవారమే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో భేటీ కానున్నారు. కీలకమైన ఈ పర్యటనకు ముందుగానే ఈ డీల్‌కు ప్రాథమిక అనుమతి లభించడం గమనార్హం. కాగా చైనా ఆధిపత్యం పెరిగిపోతున్న వేళ భారత్‌తో రక్షణ బంధాన్ని బలోపేతం చేసుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. మిలిటరీ టెక్నాలజీలో భాగస్వామి కావాలని భావిస్తోంది.కాగా ఈ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వశాఖ ఆమోదం దశ కాగా.. తదుపరి ప్రధాని మోదీ కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 30 డ్రోన్ల విక్రయానికి అమెరికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రెండున్నరేళ్లక్రితమే ఈ మేరకు అనుమతిచ్చింది. అయితే రక్షణమంత్రిత్వశాఖ క్లియర్ చేయాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ పర్యటన జూన్ 21న మొదలుకానున్న నేపథ్యంలో ఈ ఒప్పందంలో పురోగతిపై అమెరికా ప్రభుత్వం దృష్టిసారిస్తోంది

Leave A Reply

Your email address will not be published.