పుష్ప 2 లేటెస్ట్ అప్ డేట్స్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్:  ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న అతి కొద్ది చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2” కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ మరియు ఫస్ట్ లుక్ లతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిన ఈ భారీ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో అయితే నడుస్తుంది.
ఇక ప్రస్తుతం మేకర్స్ ఒడిశా లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తున్నారట. పెద్ద సంఖ్యలో కనిపించే పోలీస్ లతో అయితే ఈ సన్నివేశాలు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ సెట్స్ లో పోలీస్ కాస్ట్యూమ్స్, గన్స్, ఇతర సామాగ్రి తో నిండిపోయిందట. దీనితో సినిమాలో చాలా కీలక సన్నివేశాలనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.