పార్లమెంట్‌ లో తిరిగి అడుగుపెట్టనున్న రాహుల్‌ గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తిరిగి పార్లమెంట్‌ లోఅడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్‌ సభ సచివాలయంసోమవారం ప్రకటించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాహుల్‌ పాల్గొననున్నారు.గతంలో మోదీ ఇంటి పేరు పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు గత వారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్‌ సభ్యత్వాన్ని దిగువ సభ పునరుద్ధరించింది. ఈ మేరకు లోక్‌ సభ సెక్రటేరియట్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఏం జరిగిందంటే..?

కాగా, 2019 ఏప్రిల్‌ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోదీ అనేసాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌కు చెందిన బీజేపీఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దీనిపై సూరత్‌ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ గాంధీపై క్రిమినల్ పరువు నష్టందావా వేశారు. విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ గాంధీని దోషిగా నిర్ధారించిరెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఆ మరునాడు ఆయనపై నర్హత వేటువేశారు.మరోవైపు జైలు శిక్షపై స్టే కోసం రాహుల్‌ గాంధీ ట్రయల్‌ కోర్టుతోపాటు గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారు.ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనంఊరట ఇచ్చింది. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ హోదానుపునరుద్ధరించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కోర్టు తీర్పుతో రాహుల్‌ తాజాగా తన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలిగారు.

Leave A Reply

Your email address will not be published.