దుమారం రేపుతున్న రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విధాత: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. కానీ మహారాష్ట్రలో ఆయన సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు, ఇతర విపక్షాలు కూడా రాహుల్ పాదయాత్ర పాల్గొంటూ.. మద్దతు తెలుపుతున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ చేసే భావోద్వేగ రాజకీయాలకు లబ్ధి చేకూరేలా సావర్కర్ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. శివసేన కూడా రాహుల్ వ్యాఖ్యలను తప్పు పట్టింది. ఇలాంటి సున్నిత అంశాలను లేవనెత్తడాన్ని తప్పు పట్టింది. ఇలాంటి సమయంలో దేశాన్ని ఏకం చేయడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించింది. ఎందుకంటే హిందుత్వ రాజకీయాలు చేసే బీజేపీకి రాహుల్ వ్యాఖ్యలు మేలు చేస్తాయని వారి వాదన.
ఇందులో వాస్తవం లేకపోలేదు. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్న కేంద్రం ఎన్నికల సమయంలో సున్నిత అంశాలను తెర మీదికి తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా ఎన్నికల్లో విపరీతంగా ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కరించలేక, విభజన రాజకీయాలు చేస్తున్నది అన్న విపక్షాల మాటలను ప్రజలు విశ్వసించారు. కొన్ని సందర్భాల్లో బీజేపీకి బుద్ధి చెప్పారు. కానీ ఆ పార్టీ ట్రాప్‌లో పడితే అది అంతిమంగా బీజేపీకే బెనిఫిట్ అవుతున్నదన్న శివసేన నేత సంజయ్ రౌత్ మాటలు ఈ సందర్భంగా చాలా మంది గుర్తు చేస్తున్నారు. కాబట్టి రాహుల్ వ్యాఖ్యలు అప్రస్తుతం అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.