ప్రజలతో మమేకం అయ్యేందుకు లారీలో ప్రయాణించిన రాహుల్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జోడోయాత్ర తర్వాత నుంచి కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ తన తీరును మార్చుకోవటమే కాదు.. ప్రజల్లో మమేకం అయ్యే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు. తాజాగా ఆయన శిమ్లాకు వెళుతున్న సందర్భంగా ఊహించని రీతిలో రియాక్టు అయి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తన తల్లి సోనియాగాంధీ శిమ్లాలో సేద తీరుతున్న వేళ.. ఆమెను కలిసేందుకు కారులో బయలుదేరారు రాహుల్ గాంధీ.ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్లే క్రమంలో ఆయన తాను ప్రయాణిస్తున్న కారును దిగి.. ఒక ట్రక్కును ఆపి.. అందులోకి ఎక్కారు. ఒక్కసారిగా రాహుల్ గాంధీ అంతటి వ్యక్తి తన ట్రక్కులోకి వచ్చి.. తమ పక్కన కూర్చోవటంతో డ్రైవర్లు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి.అంతేకాదు.. ఒక దాబా వద్ద ఆగిన రాహుల్.. లారీ డ్రైవర్లతో మాటామంతీ జరిపారు.దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం పోస్టు చేసింది.దేశ వ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది లారీ డ్రైవర్లు ఉన్నారని.. వారికి బోలెడన్ని సమస్యలు ఉన్నట్లుగా రాహుల్ పేర్కొన్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవటం కోసం తాను వారి మధ్యకు వెళ్లినట్లు చెప్పారు.లారీ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు సాధ్యమైనంత త్వరగా ప్రయత్నిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఓపక్క ప్రధాని మోడీ విదేశాల్లో దేశాధినేతలతో కితాబులు పొందుతూ భారీగా ఇమేజ్ బిల్డ్ చేస్తున్న వేళలో.. రాహుల్ మాత్రం సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.