క్లౌడ్‌బ‌స్ట్ వ‌ల్ల‌ భారీ వ‌ర‌దల వల్ల వేలాడుతోన్న రైల్వే ట్రాక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఆక‌స్మిక వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. షిమ్లాతో పాటు అనేక ప్రాంతాల్లో భీక‌ర స్థాయిలో న‌ష్టం వాటిల్లింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వాన‌ల వ‌ల్ల రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోతున్నాయి. స‌మ్మ‌ర్ హిల్ వ‌ద్ద ఉన్న షిమ్లా-క‌ల్కా రైల్వే లైన్ డ్యామేజ్ అయ్యింది. క్లౌడ్‌బ‌స్ట్ వ‌ల్ల‌ భారీ వ‌ర‌ద రావడంతో.. రైల్వే ట్రాక్ కింద ఉన్న మ‌ట్టి ఊడ్చుకుపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్ వేలాడుతోంది దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఇత‌ర ప్ర‌దేశాల్లోనూ రైల్వే ట్రాక్ అక్క‌డ‌క్క‌డ ధ్వంస‌మైంది.

Leave A Reply

Your email address will not be published.