తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి రుతుపవనాలు బలపడటం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నేడు సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్, కుమురం భీం, ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. ఇక భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉరములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని జాగ్రత్తగా ఉండాలన్నారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు.ఇక ఆదివారం (జులై 14) తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. సాయంత్రం తర్వాత మేఘానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం కురిసింది. యూసుఫ్‌గూడలో అత్యధికంగా 9.8 సెంటీ మీటర్లు, మెట్టుగూడలో 8.23 సెం.మీ, మారేడుపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదయినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్‌లో 7.33 సెం.మీ. వర్షం కరుసిందన్నారు. మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌లో 6.8 సెం.మీ, సికింద్రాబాద్‌లో 6.03 సెం.మీ, మల్కాజిగిరిలో 6 సెం.మీ. వర్షపాతం నమోదయినట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.