తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వాతావరణశాఖ వర్షాలపై కీలక అప్టేట్ ఇచ్చింది. బ్రేక్ రుతు పవనాలు ఈరోజు కూడా కొనసాగుతాయని చెప్పింది. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రం వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో చెదురుమదురుగా వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవని చెప్పారు. హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉంటుందని.. జూన్ 17 తర్వాతే తెలంగాణలో పూర్తిస్థాయిలో వర్షాలు కురుస్తాయన్నారు.ఇక నైరుతి రుతుపవనాలు చురుగ్గానే కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. పశ్చిమ తీరం నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని.. అవి ఏపీ, తెలంగాణలోకి వస్తున్నాయన్నారు. బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకూ ద్రోణి కొనసాగుతోందని.. ఫలితంగా వచ్చే ఐదు రోజులపాటూ.. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.