రాష్ట్రంలో మళ్ళి వర్షాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కొన్ని రోజులుగా గ్యాప్ ఇచ్చిన వర్షాలు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయని వాతావరణ శాఖ కీలక అప్డేడ్ ఇచ్చింది. ఈరోజు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 40 కిలోమీటర్లతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈరోజు.. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, నారాయణ్ పేటతో పాటు మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేడ్ ఇచ్చింది. దీంతో పాటు.. రానున్న వారం రోజుల పాటు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే.. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి వరదలతో రాష్ట్రమంతా అతలాకులమైంది. భారీగా పంట నష్టం సంభవించింది. పలు గ్రామాలు ఇప్పటికీ ఆ ముంపు ప్రభావం నుంచి తేరుకోలేకపోతున్నాయి. ఇప్పుడిప్పుడే.. ఆయా ప్రాంతాల్లో జనజీవనం కాస్త కుదుటపడుతోంది. రహదారులు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇప్పటికీ రాకపోకలు పూర్తిగా పునరుద్దరించలేదు. మహోగ్రరూపం దాల్చిన వాగులు.. ఇప్పుడిప్పుడే శాంతించాయి. ఇదిలా ఉంటే.. మొన్నటి భారీ వర్షాల వల్ల.. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.