ఎమ్మెల్యే పదవికి రాజయ్య రాజీనామా చేయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ భవన్ మెయిన్ రోడ్డు పైన ఎమ్మెల్యే రాజయ్య దిష్టిబొమ్మ దహన సంస్కారం నిర్వహించడం జరిగింది.
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ సభ్యులు తాటికొండ రాజయ్య జనగాం జిల్లా ధర్మసాగర్ మండలంలోని జానకిపురం సర్పంచ్ కురసపేల్లి నవ్యను తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధించడాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మా సర్పంచ్ నవ్యతో చరవాణిలో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీలం పద్మ మాట్లాడుతూ నవ్యను తన దగ్గరికి రాకుంటే గ్రామానికి వచ్చిన నిధులను నీకు ఇవ్వను అంటూ సర్పంచ్ను మానసికంగా దుర్భాషలాడుతూ. సర్పంచ్ నవ్వేను ఎమ్మెల్యే రాజయ్య అనేక ఇబ్బందులకు గురి చేశాడని చెప్పారు. కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కూడా రాజయ్య కోరిక తీర్చాలంటూ సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బోరుణ విలపించినట్లు ఆమె తెలిపారు. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచ్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎమ్మెల్యే రాజయ్యను ఎమ్మెల్యే పదవి నుండి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తరప్ చేసి. ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నవ్యకు మహిళలోకం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు నువ్వంటే ఇష్టమని ఇబ్బందులకు గురి చేసిన వారిని గుర్తించి. వారిపై కూడా లైంగిక వేధింపులకు కేసు నమోదు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత మహిళల రక్షణ కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధి పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తాటికొండ రాజయ్యను ఏం చేస్తారని ఈ సందర్భంగా పద్మ కవితను ప్రశ్నించారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని ఢిల్లీలో దీక్ష చేపడుతున్న కవితకు మహిళా కాంగ్రెస్ తరపున సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూనే మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్న ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క సంఘటనే కాదు ఇంకా జడ్పీ చైర్మన్ ల పైన. మున్సిపల్ చైర్మన్ ల పైన. ఎంపీపీల పైన జడ్పిటిసి ల పైన అనేక విధాలుగా ఏదో రకంగా వాళ్ళని ఏడిపిస్తూ వేధిస్తున్నారు. మహిళలోకానికి బే షరతుగా ఎమ్మెల్సీ కవిత మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు నవ్యకు క్షమాపణ చెప్పాలని అన్నారు లేకుంటే తెలంగాణ మహిళలు అందరూ రోడ్లపై కు వచ్చి చీపురు. చాటలతో బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులను వారు తరిమి తరిమి కొడతారని పద్మ హెచ్చరించారు కార్యక్రమంలో సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత. సుభాషిని సంగీత రమాదేవి. జిలాని భాగ్యలక్ష్మి, రోజి. స్వరూప .రాక్యూ బేగం రాజోలి బేగం.యాంజలి. రాణి.విజయ.ఉమ. మొదలగువారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.