పైరసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. మణిపూర్‌ అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేయడంతోమూజువాణి ఓటుతోనే సినిమాటోగ్రఫీ(సవరణ) బిల్లు-2023కు సభ ఆమోదం తెలిపింది. సినిమా పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా విధించేలా నిబంధనలు పొందుపరిచారు.పదేండ్లు చెల్లుబాటయ్యేలా ఇప్పటివరకు సినిమాలకు సర్టిఫికెట్లు జారీచేస్తుండగాఇకపై దానికి ఎత్తివేసి శాశ్వత సర్టిఫికెట్‌ జారీచేయనున్నారు. అలాగే వయసువారీగా యూఏ’ సర్టిఫికెట్‌ జారీచేయాలని ప్రతిపాదించారు. ఇకపై యూఏ 7ప్లస్యూఏ 13ప్లస్‌యూఏ 16 ప్లస్‌ సర్టిఫికెట్లు జారీచేయనున్నారు. టెలివిజన్‌ఇతర మాధ్యమాల్లో ప్రసారానికి ప్రత్యేక సర్టిఫికెట్‌ జారీచేసేందుకు సీబీఎఫ్‌సీ(సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌) కి అనుమతించారు.

Leave A Reply

Your email address will not be published.