లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ రామరెడ్డి ఇంచార్జి తహసిల్దార్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని లంచం తీసుకుంటూ ఇంచార్జ్ తహసిల్దార్, ధరణి ఆపరేటర్ ఎసిబికి పట్టు బడ్డారు నిజామాబాద్ ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామారెడ్డి ఇంచార్జ్ తహసిల్దార్ మానస ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ద్వారా అన్నారం గ్రామానికి చెందిన రైతు బంధం బలరాం నుంచి 4000 లంచం తీసుకుండగా గురువారం మధ్యాహ్నం ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఇన్స్పెక్టర్ నగేష్ శ్రీనివాసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టారు. రైతు బలరాం తన పెద్దమ్మ పేరున ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని రామారెడ్డి తాసిల్దార్ కార్యాలయంలోని ధరణి ఆపరేటర్ను కలిశాడు తన పెద్దమ్మకు ఎవరో లేకపోవడంతో భాగాలు తనే చూసుకోనో వాడినని రెండేళ్ల క్రితం ఆమె మరణించడంతో ఆమె పేరిట ఉన్న 37 గుంటలు భూమిని తన పేరు మీదుగా మార్చాలని అర్జీ పెట్టుకున్నారు దీంతో ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ ఆన్లైన్ పేజ్ రూపాలు 3000 దాని తర్వాత లంచం రూపంలో 10000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు లంచం ఇవ్వలేనని రైతు ఇంచార్జ్ తహసిల్దార్ మానసను కలవగా రూపాలు 4000 ఇవ్వాలని ఆమె సూచించారు ఆ డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టం లేక బలరాం నిజామాబాద్ లోని ఎసిబి అధికారులతో దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు గురువారం మధ్యాహ్నం బలరాం రూపాలు 4000 లంచం డబ్బులను ధరణి ఆపరేటర్ లక్ష్మణ్ కు ఇస్తుండగా అధికారులు రేట్ హ్యాండెడ్గా పట్టుకున్నారు తదుపరి విచారణ చేస్తున్నామని ఇన్చార్జ్ తహసిల్దార్ ధరణి ఆపరేటర్ పై చర్యలు ఉంటాయని డిఎస్పి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.