మార్కెట్లో రూ.2000 నోటు చలామణి ఉపసంహరించుకున్న ఆర్బీఐ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మార్కెట్లో రూ.2000 నోటు చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకున్నది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు మార్చుకునేందుకు ప్రజలకు అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ రూ.2000 అంతా అనుకున్నట్లే అయింది. 2016 నవంబర్ 8 అర్థరాత్రి అర్ధంతరంగా నోట్ల రద్దు ప్రకటించిన కేంద్రం.. ప్రజల సౌకర్యార్థం రూ.2000, రూ.500 నోటు తీసుకొచ్చింది. కానీ, రూ.2000 నోటు వల్ల బ్లాక్ మనీ పెరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నది.రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. దేశంలోని 19 ప్రాంతీయ ఆర్బీఐ శాఖల్లో వాటిని మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. బ్యాంకులు సైతం రూ.2000 నోట్లను సర్క్యులేషన్‌లో పెట్టవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.రూ.2000 నోట్లు ఉన్న వారు వచ్చే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల్లో సబ్మి్ట్ చేసి మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఒక్కొక్కరూ ప్రతి విడతలోనూ రూ.20 వేల విలువైన నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 23 నుంచి రూ.2000 నోటు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది.

Leave A Reply

Your email address will not be published.