గ్రంథాలయాలను పాఠకులు సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సదాశివపేట మండలంలో సదాశివపేట గ్రాడ్యుయేట్ ఫారం ఆధ్వర్యంలో గ్రంథాలయం యొక్క ఆవశ్యకతను పాఠకులకు తెలియజేయుటకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ హాజరై గ్రంథాలయం పాఠకుల యొక్క   మూలధనమని అట్టి మూలధనమైన విద్యను మరియు మెరుగైన వసతులను సద్వినియోగం చేసుకోవాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం పాఠకులు కోరిన విధంగా అనుగుణంగా వసతులు కల్పించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయ విద్యాజ్యోతిలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠకులు కోరిన విధంగా సంపూర్ణంగా వసతులతో ఏర్పాట్లు అయ్యేవరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం సదాశివపేట గ్రాడ్యుయేట్ అసోసియేషన్ పోరాటాలకు అండగా ఉంటూ విధిని నెరవేరుస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో సదాశివపేట గ్రాడ్యుయేట్ అసోసియేషన్ విశాల్ తన విలువైన సందేశాన్ని తెలియజేస్తూ పాఠకులకు ఇట్టి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టబద్రులు ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమహేష్పరమేష్నర్సింలు మరియు పాఠకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.