టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాల నుంచి కొన్నిటిని స్వాధీనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ నౌక శిథిలాలను చూడటం కోసం ఔత్సాహికులను తీసుకెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాల నుంచి కొన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది. ఇవి మానవ అవశేషాలు అయి ఉండవచ్చునని తెలిపింది. వీటిని తిరిగి అమెరికాకు తీసుకొస్తున్నట్లువీటిని పరీక్షించివిశ్లేషించనున్నట్లు వివరించింది. ఈ సబ్‌మెర్సిబుల్ గత వారం సముద్రంలో మునిగిపోవడంతో దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు బుధవారం సెయింట్ జాన్స్న్యూఫౌండ్‌ల్యాండ్లాబ్రడార్ నౌకాశ్రయానికి చేరుకున్నాయి. సముద్ర గర్భం నుంచి సేకరించిన ఆధారాలను మానవ అవశేషాలుగా భావిస్తున్నట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ కీలక సాక్ష్యాధారాలను సేకరించడంలోభద్రపరచడంలో అంతర్జాతీయ సంస్థలు సమన్వయంతో కృషి చేసినందుకు కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జేసన్ న్యూబౌర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషాదానికి కారణాలను తెలుసుకోవడం కోసం వివిధ దేశాలకు చెందిన సంస్థలు చేసే దర్యాప్తునకు ఈ సాక్ష్యాధారాలు ఉపయోగపడతాయని తెలిపారు. టైటాన్ విపత్తుకు కారణాలను అర్థం చేసుకోవడం కోసం ఇంకా చాలా కృషి చేయవలసి ఉందన్నారు.గత ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించేందుకు కెనడాకు చెందిన నౌక హొరైజాన్ ఆర్కిటిక్ రిమోట్‌లీ ఆపరేటెడ్ వెహికిల్‌ తో కార్యకలాపాలను నిర్వహించింది. టైటానిక్ నౌక శిథిలాల వద్ద నిర్వహించిన ఈ ఆఫ్‌షోర్ కార్యకలాపాలు ముగిసినట్లు ఈ ఆర్ఓవీ యాజమాన్య కంపెనీ పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ బుధవారం ప్రకటించింది. అయితే అమెరికాకెనడాలకు చెందిన ప్రభుత్వ సంస్థలు ఈ దర్యాప్తులో భాగస్వాములైనందువల్ల ఈ దర్యాప్తు గురించి మరిన్ని వివరాలను చెప్పలేమని ఈ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు టైటానిక్ నౌక శిథిలాల నుంచి దాదాపు 1,600 అడుగుల దూరంలో, 12,500 అడుగుల లోతులో కనిపించినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడించింది. జూన్ 18న టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఎందుకు కుప్పకూలిపోయిందో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు జూన్ 22న ప్రకటించిన సంగతి తెలిసిందే.

అత్యున్నత స్థాయి దర్యాప్తు

టైటాన్ సబ్‌మెర్సిబుల్ కుప్పకూలిపోవడానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డ్ ఓ దర్యాప్తు కమిటీ ను ఏర్పాటు చేసింది. కోస్ట్ గార్డ్ నిర్వహించే అత్యున్నత స్థాయి దర్యాప్తు ఇది. సముద్రంలోని అట్టడుగు ప్రాంతాల్లో ప్రయాణించే ప్రతి వాహనంలోనూ ఉండే పరికరాలన్నీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తాయనిఅయితే ఆ డేటా అందుబాటులో ఉందాఅనేదే ప్రశ్న అని ఓ అధికారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.