తెలంగాణకు రెడ్ అలర్ట్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు వారం రోజులపాటు కురుస్తూనే ఉన్నాయి. దీని ప్రభావంతో జంట జలాశయాలకు వరద ఉధృతి పెరిగింది. చెరువులు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అది రానున్న నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. రానున్న 24 గంటల్లో దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు నుండి నాలుగు రోజులు విస్తారంగా పాఠశాల అనేక చోటు కొలిచే అవకాశం ఉంది. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావం వల్ల మూడు రోజులపాటు రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారి నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. కాగా ఇప్పటికే 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లో జల కళ కనిపిస్తుంది. జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.