ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు ఆయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గింపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గించింది. ఈ రెండు నూనెలపైనా దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగదారులకు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది.అయితే ట్రేడర్ల స్పందన వేరే విధంగా ఉంది. ప్రభుత్వం కేవలం సెంటిమెంట్ కోసమే ఈ చర్య తీసుకుందనిక్షేత్ర స్థాయిలో దీని ప్రభావం పెద్దగా ఉండదని చెప్తున్నారు. మన దేశం రిఫైన్డ్ సోయాబీన్రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లను అరుదుగా దిగుమతి చేసుకుంటుందని చెప్తున్నారు. వీటిని ముడి రూపంలోనే దిగుమతి చేసుకునిభారత దేశంలోనే రిఫైన్ చేస్తారని చెప్తున్నారు. క్రూడ్ సోయాబీన్ ఆయిల్సన్‌ఫ్లవర్ ఆయిల్పామాయిల్‌లపై దిగుమతి సుంకం దాదాపు 5.50 శాతం.దేశీయంగాఅంతర్జాతీయంగా కొద్ది నెలలుగా వంట నూనెల ధరలు తగ్గిపోయాయనిసుంకాలను పెంచాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఈ సుంకాలను తగ్గించింది. ఎన్నికల ఏడాది కావడంతో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ట్రేడర్లు అంటున్నారు. ఎల్‌నినో సంవత్సరం కావడంతో 2023లో నైరుతి రుతుపవనాలపై ఆందోళన ఉందని అంటున్నారు. వంట నూనెల ధరలు అదుపులో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్తున్నారు. సుంకాల తగ్గింపు వల్ల తాత్కాలికంగా సెంటిమెంటల్ ప్రభావం ఉండవచ్చునని చెప్తున్నారు.2023 జూన్ 2నాటి సమాచారం ప్రకారం దిగుమతి చేసుకున్న క్రూడ్ పామాయిల్ ధర భారత దేశంలో టన్నుకు దాదాపు 860 డాలర్లు. ఇది గత ఏడాది కన్నా 45 శాతం తక్కువ. దిగుమతి చేసుకున్న క్రూడ్ సోయాబీన్ టన్ను ధర 970 డాలర్లు. ఇది గత ఏడాది కన్నా 43 శాతం తక్కువ. దిగుమతి చేసుకున్న క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు 860 డాలర్లు. ఇది గత ఏడాది కన్నా 55 శాతం తక్కువ.2023 ఏప్రిల్‌లో మన దేశం 1.05 మిలియన్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో దిగుమతి చేసుకున్నదాని కన్నా 15 శాతం ఎక్కువ.

Leave A Reply

Your email address will not be published.