పశువైద్య ,పశు సంవర్ధక శాఖ లో రీఆర్గనైజేషన్ చేయాలి

స్పీకర్  ను కోరిన  పశువైద్య, పశు సంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పశువైద్య, పశు సంవర్ధక శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు డా .కే.రామారావు , డాక్టర్ నాగయ్య అధ్యక్షులు మరియు డాక్టర్ భాను నాయక్ ప్రధాన కార్యదర్శి గార్ల ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను కలసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు  తెలిపారు. అదేవిధంగా  పశువైద్య ,పశు సంవర్ధక శాఖ లో రీఆర్గనైజేషన్ చేయాలని & G.O.M.S.No.317 లో ఇబ్బందులు పడుతున్న వారి సమస్యల మీద విజ్ఞప్తి చేసారూ. ఇందుకు తెలంగాణ శాసన సభాధిపతి  సానుకూలంగా స్పందించినట్లు వారు తిలిపారు.అలాగే శాఖకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చించడం జరిగిందాని తెలిపారు..ఈ కార్యక్రమంలో డా.సిహెచ్.నరసింహరావు, డా.డి.శాంతిబాబు, డా బి.రమేష్, డా ఎం.రఘు కిషోర్ మరియుడా ఎన్.నరేందర్ తదితరులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.