ఐక్య రాజ్య సమితి సమావేశం లో యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస ప్రతినిధి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐక్య రాజ్య సమితి లో మహిళా సాధికారతపై జరిగిన సమావేశంలో తన దేశం యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస ప్రతినిధి పాల్గొన్నారని నిత్యానంద పరమశివం ప్రకటించారు. నిర్ణయాలు చేసే వ్యవస్థల్లో మహిళలకు సమాన, సమ్మిళిత పాత్ర; ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులు, సుస్థిర అభివృద్ధిపై సాధారణ వ్యాఖ్య అంశాలపై ఈ సమావేశం జరిగినట్లు తెలిపారు.యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఎక్కడ ఉందో స్పష్టంగా తెలియడం లేదు. దీనికి ఐక్య రాజ్య సమితి గుర్తింపు ఉందా? లేదా? అనే అంశంపై కూడా స్పష్టత లేదు. ఇదొక కల్పిత దేశం. భారత దేశంలో తనపై వివిధ నేరాలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో నిత్యానంద అక్కడి నుంచి పారిపోయారు.నిత్యానంద ఇచ్చిన ట్వీట్లలో కైలాస అధిపతి సెయింట్ లూయీస్ మా సోనా కామత్, కైలాస ప్రతినిధులు జెనీవాలో ఫిజీ, కామెరూన్ దౌత్యవేత్తలు సమావేశమైనట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.