టైం స్కేల్‌ ఇవ్వాలని స్పీకర్‌కు వినతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గ్రామీణాభివృద్దిశాఖలో పనిచేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వాలని కోరుతూ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2022 మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. గత 27 సం.ల నుండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో గ్రామీణ అభివృద్ది సంస్థ చేపట్టిన ఆయా అభివృద్ది పథకాలలో పనిచేస్తున్న వారిని గ్రామీణాభివృద్ది శాఖ కింద తీసుకుని వారి సేవలను ఉపాధిహామీ పథకం, సీఎం గిరి వికాసం, తెలంగాణకు హరితహృారం, పల్లెప్రగతి, స్వచ్ఛబారత్‌ వంటి కార్యక్రమాలు ఆయా ప్రభుత్వ శాఖలలో కన్సల్టెన్సీ పనులు ఉపాధిహామీ పథకం ద్వారా పనిచేస్తూ దేశంలో తెలంగాణను ముందంజలో ఉంచేలా విధులు నిర్వహఙస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధిహామీ, సెర్ప్‌ ఉద్యోగులకు 2008 నుండి హెచ్‌ఆర్‌ పాలసీ పరిధిలోకి తీసుకువచ్చి ఒకే కమిషనర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కింద ఎఫ్‌టీఈలుగా నియమించడం జరిగిందని, ప్రస్థుతం రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్‌ లో ఉన్న ఎఫ్‌టీఈలకు మాత్రమే టైం స్కేల్‌లో కవర్‌ అవుతున్నారని తెలిపారు. అందువల్ల తమ పట్ల దయ చూపి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథఖం ద్వారా పనిచేస్తున్న 3874 మంది ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వాలని వారు వినతిపత్రం ద్వారా కోరారు.

Leave A Reply

Your email address will not be published.