ప్రభుత్వ పాఠశాలలో చదివితే రిజర్వేషన్లు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోటా కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. యూనివర్సిటీల్లో వెటర్నరీ సైన్సెస్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని కేటగిరీలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ప్రభుత్వం 7.5 శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్థిక అసమానతల కారణంగా వారు కోరుకున్న కోర్సులలో ప్రవేశం పొందలేకపోయారన్నారు. గ్రామాలకు చెందిన వారు, డబ్బుల్లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. కాగా ప్రతిపక్ష అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును స్వాగతించింది.

Leave A Reply

Your email address will not be published.