మిషన్ భగీరథ ఎండా కాలం సన్నద్ధత పై సమీక్ష సమావేశం

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మిషన్ భగీరథ ఎండా కాలం సన్నద్ధత పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ సమీక్షలో రానున్న ఎండాకాలం నేపథ్యంలో నిరాటంకంగా నిర్వర్తించాల్సిన మంచినీటి సరఫరా పై మిషన్ భగీరథ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎండాకాలం లో నీటి ఎద్దడి ఎక్కడా రాకుండా చూడాలి, అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండి, సమన్వయంతో పని చేయాలి, అన్ని రిజర్వాయర్లు నిండి ఉండేలా ఇప్పుడే జాగ్రత్త పడండి అని మంత్రి సూచించారు. ఎండా కాలంలో కూడా నిర్దేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలి, కరెంటు సమస్యలు వచ్చినా, నీటి సరఫరా ఆగవద్దు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడండి అన్నారు. పంపుల మెయింటెనెన్స్ సరిగా చేయాలి. పైప్ లైన్ లీకేజీ లు లేకుండా జాగ్రత్త వహించాలి. ఫిల్టర్ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్ సరిగా చేయాలి, అన్ని స్కూల్స్, అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచినీరు అందాలి, ఈ సారి ఎండలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, నీటి సరఫరా కు ఆటంకాలు లేకుండా, అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఈ ఎన్ సి, ce లు, ఈ ఈ లు, అన్ని జిల్లాల ఎస్ ఈ లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.