కృషి సించాయి యోజన- వాటర్ షెడ్ డెవలప్ మెంట్ కాంపొనెంట్ పై సమీక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్

ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన- వాటర్ షెడ్ డెవలప్ మెంట్ కాంపొనెంట్ పైన హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది శిక్షణ కేంద్రం లో దక్షిణాది రాష్ట్రాల పధక అమలు అధికారులతో  కేంద్ర ప్రభుత్వ భూ వనరుల అభివృద్ది  శాఖ  సెక్రెటరీ  శ్రీ. అజయ్ టిర్కి, ఐఏఎస్ గారు సమీక్ష నిర్వహించినారు. ఈ సమీక్షలో ముఖ్యంగా పధకం అమలు జరుగుతున్న విధానము, జరిగిన ప్రగతి మరియు ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల గురించి చర్చించినారు. ఈ కార్యక్రమమును తెలంగాణ రాష్ట్రం ఆతిధ్య రాష్ట్రం గా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్త పరిచారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన- వాటర్ షెడ్ డెవలప్ మెంట్ కాంపొనెంట్ పధకములో దక్షిణాది రాష్ట్రాలలో చేపట్టిన కార్యక్రమాలను కాంపొనెంట్ వారీగా అడిగి తెలుసుకొని పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాలలో చేసిన ఉత్తమ పద్దతులను ( బెస్ట్ ప్రాక్టిసెస్) ను రాష్ట్రాల అధికారులు చలన చిత్ర ప్రదర్శన ద్వారా చూపడమైనది.దక్షిణాది రాష్ట్రాలకు ఈ కార్యక్రమాలు నిర్వహించడములో ఎంతో సమర్దత ఉంది అని ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల గురించి కొనియాడారు. ఆదేవిదముగా, ఈ రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల వారికి నమూనా (మాడెల్ ) గా ఉన్నాయన్నారు. ఈ రాష్ట్రాల అధికారులను పధక అమలులో లీడర్ గా పేర్కొన్నారు.

ఈ పధకము యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు

  1. క్షీణించిన సహజ వనరులను సంరక్షించడం మరియు అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం.
  2. శాస్త్రీయ విధానం & స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తి & ఉత్పాదకతను పెంచడం.
  3. సమీకృత  పశువుల నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచడం
  4. గ్రామీణ పేదలలో నిరుపేదలైన వారికి  జీవనోపాధుల భద్రత.

 

ఈ పధకము ద్వారా చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు

  1. ఆజాదీ క అమృత్ మహోత్సవ్ – మిషన్ అమృత్ సరోవర్ క్రింద చేపట్టిన పనులు,
  2. ఎంట్రీ పాయింట్ కార్యక్రమము గ్రామాలలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు
  3. పధక పరిధిలో ఉన్న గ్రామలలోని రైతులకు, వివిధ సంఘాల వారికి మరియు సిబ్బందికి వివిధ రకాల శిక్షణాల ద్వారా వారి సామర్ధ్యాలను బలోపేతం చేయడం.
  4. సహజ వనరుల అభివృద్ది మరియు నిర్వహణ
  5. పధక పరిధిలోని రైతుల యొక్క ఉత్పాదకత పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడమవుతుంది
  6. వివిధ రకాల జీవనోపాధులను పెంపొందించడమైనది

పైన తెలిపిన కార్యక్రమాల ద్వారా సహజ వనరుల నిర్వహణ చేపట్టడం,  గ్రామీణ పెదలలో జీవనోపాధులు పెంచడానికి మరియు ఉత్పాదకత పెంచడానికి అవసరమైన కార్యక్రమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్ టిర్కి, ఐఏఎస్ అందరు అధికారులను ఉద్దేశించి సూచించారు. ఈ కార్యక్రమములో,  కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి హుకుం సింగ్ మీనా, ఐఏఎస్,  సంయుక్త కార్యదర్శి ఉమా కాంత్, సీనియర్ అడిషనల్ కమిషనర్డాక్టర్ సి. పి. రెడ్డి మరియు   డైరెక్టర్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. రాజేష్ కుమార్ సింగ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి తో పాటు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.