ధర్మం నిలబడుతుంది- తిరుగుబాటు తప్పదు   

- చంద్రబాబు అరెస్టుపై స్పందించిన నటుడు నరేష్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తాను ప్రత్యేకంగా ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడాలని భావించడం లేదని.. అయితే ధర్మం ఎప్పుడూ నిలబడుతుందని నరేష్ అన్నారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచిస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఆ తిరుగుబాటు ఫలితం తప్పకుండా వస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని.. ఆ ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని చాలామంది నాయకులు జైల్లో ఉన్నారని నరేష్ గుర్తుచేశారు. తర్వాత ఏమైందో అందరికీ తెలుసని.. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నరేష్ అన్నారు. రాజకీయంగా వారసులు రావడం కరెక్టో.. కాదో తాను చెప్పలేనని తెలిపారు. అయితే నాయకులు సరిగ్గా పనిచేస్తే తప్పకుండా విలువ ఉంటుందన్నారు. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయం అనేది డబ్బుతోనే ముడిపడి ఉందన్నారు. ఈ ముడిని విప్పడం ప్రజల చేతుల్లోనే ఉందని నరేష్ చెప్పారు. అటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపైనా నరేష్ స్పందించారు. సినిమా పరిశ్రమకు చెందిన పవన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోరాటం చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నట్లు నరేష్ వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.