ఆర్టీసీ బస్సు – డి సి ఎం .. ఢీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీ కొట్టింది. బురెడ్డిపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే బస్సులో పెద్ద మెుత్తంలో మంటలు చేలరాగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరానికి ఆదివారం రాత్రి బయల్దేరింది. బస్సులో మెుత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు.మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని బురెడ్డిపల్లి చౌరస్తాలో రాగానే.. యూటర్న్ తీసుకుంటున్న ఓ డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా..ఏం జరిగిందో తెలియకు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున ఆహాకారాలు చేస్తూ.. బస్సు నుంచి బయటకు దూకేశారు. ఇంతలోనే బస్సు ఇంజిన్‌లో మంటలు చేలరేగాయి. క్షణాల్లోనే బస్సు మెుత్తం మంటలు వ్యాపించాయి. అయితే అప్పటికే బస్సులోని ప్రయాణికులు అంతా కిందకు దిగేశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్సు మాత్రం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్లను రప్పించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన ప్రయాణికులను జడ్చర్ల, నవాబుపేట, హన్వాడ, మిడ్జిల్, భూత్పూర్ ప్రాంతాల నుంచి వచ్చిన అంబులెన్స్‌లలో జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.