ప్రయాణికుల జేబులకు ఆర్టీసీ చిల్లు

.. చార్జీల పేరుతో దోపిడీ .. 25 కిలోల బ్యాగ్ కు 80 రూపాయల ఛార్జ్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ హైదరాబాద్:  ఇందన ధరలు పెరుగుతున్నాయని సాకుగా చూపుతూ ఆర్టీసి బస్సు చార్జీలను ఇష్టానుసారం పెంచేస్తోంది. ఇటీవల ఓ ప్రయాణికుడు బాన్సువాడ నుండి హైదరాబాద్ పట్టణానికి బస్సు లో వెళుతూ తన వెంట 25 కిలోల బియ్యం బ్యాగులను తీసుకు వెళుతుండగా బస్సు కండక్టర్ లగేజీ కి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పగా రెండు బ్యాగులకే ఏకంగా 160 రూపాయలు లగేజీ టిక్కెట్ ఇవ్వడం తో సదరు ప్రయాణికుడు అవాక్కయ్యాడు. గతం లో లగేజీ కి 20 నుండి 30 రూపాయలు తీసుకునే వారు. కానీ ఇప్పుడు పెంచిన చార్జీలతో సాధారణ ప్రయాణికులపై పెను భారం మోపుతూ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. నిరుపేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని పలికే ప్రజా ప్రతినిధులు ఆర్టీసి చార్జీలు, లగేజీ చార్జీలను మూడు, నాలుగు రెట్లు పెంచేసి మోయలేని భారాన్ని సామాన్యులపై ప్రభుత్వం మోపుతోంది. ఆర్టీసి చార్జీలు ఇంత పెరుగుతున్న ఆర్టీసి యాజమాన్యం మాత్రం తమ సంస్థ ఇంకా నష్టాల్లో ఉందని ఉపన్యాసాలు దంచుతునే ఉంటారు. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకునే పాలకులకు సామాన్యుడి ఇబ్బందులు తెలిసే అవకాశం లేనే లేదు. పని చేస్తే గాని పూట గడవని నిరుపేదలు ఒకచోట నుండి మరో చోటుకు నిత్యం న్యాయ రకాల లగేజీతో బస్సులలో రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ తీసుకున్న ఈ ధరల పెంపు నిర్ణయం సామాన్యునికి భారంగా మారింది. ఆర్టీసి లగేజీ చార్జీల పెంపు పై ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.