బస్సు చార్జీలు పెంచే యోచనలో ఆర్టీసీ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బస్సు చార్జీలు పెంచే యువసేనలో తెలంగాణ ఆర్టీసీ ఉన్నట్లు మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసందే. ముందుగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా.. అక్కడ సత్ఫలితాలను ఇవ్వటంతో తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. కేఎస్‌ఆర్టీసీ భారీగా నష్టాల్లో కూరుకుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం రూ.295 కోట్ల భారీ లాస్‌లో అక్కడి ఆర్టీసీ ఉన్నట్లు వార్త కథనాలు వచ్చాయి. అందుకు సంబంధించి ఓ నేషనల్ మీడియా తమ వెబ్‌సైట్‌లో వార్తను ప్రచురించింది. కర్ణాటక ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రెడీ అయినట్లు వార్తలో వెల్లడించింది.ఆ వార్తను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వస్తుందని చెప్పారు. బస్సు ఛార్జీలను పెంచే యోచనలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఉందని చెప్పారు. ఛార్జీల పెంపుకు ఎంతో దూరం లేదని అన్నారు. ‘ఎప్పటికైనా గుర్తుంచుకోండి ఎవరైనా ఫ్రీ అని చెబితే వాళ్లు మిమ్మల్ని రైడ్‌కు తీసుకెళ్తున్నట్లే. ఉచితం అని మీకు చెప్పారంటే.. దానికి ఎప్పుడైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటక బాటలో నడిచి బస్సు ఛార్జీలను పెంచే రోజు ఎంతో దూరంలో లేదు.’ కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా, మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. సిటీ బస్సులతో పాటు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, ఎక్స్‌ప్రెస్‌లు, పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత బస్సు జర్నీ కల్పిస్తున్నారు. జీరో టికెట్ తీసుకొని రాష్ట్రం నలుమూలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పడా సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరుకుంది.

Leave A Reply

Your email address will not be published.