అమెజాన్ ఉద్యోగులకు మారిన రూల్స్

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీసుకున్న నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులు వారంలో కనీసం 3 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కి స్వస్తి పలుకుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది అమెజాన్. మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని, ఉద్యోగులు తప్పనిసరిగా వారంలో మూడు రోజులు కార్యాలయాలకు (Work From Office Policy) రావాలని ఫిబ్రవరి 17న కార్పొరేట్ సిబ్బందికి పంపించిన మెమోలో అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ సూచించారు. ఈ నిర్ణయాన్ని గత వారం జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల కొత్త విషయాలను నేర్చుకునేందుకు మార్గం సులభమవుతుందన్నారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన క్రమంలో 2021లో వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని క్రమంలో చెక్ పెట్టాలని నిర్ణయించింది అమెజాన్ (Amazon Employees). కార్పొరేట్ ఉద్యోగులు వారంలో ఎన్ని రోజులు ఆఫీసుకు రావాలనే విషయంపై నిర్ణయాధికారం వ్యక్తిగత బృందాలకు ఇస్తున్నట్లు 2021, అక్టోబర్‌లోనే తెలిపింది. తాజాగా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ సీఈఐ ఆండీ జెస్సీ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ. ఎక్కువ సమయంలో ఆఫీసులో, సహోద్యోగులతో కలిసి పని చేయడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సంస్కృతిని బలోపేతం కావడాని దొహదపడుతుందన్నారు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సహకారంతో కొత్త ఆవిష్కరణలు ఈజీగా మారతాయని పేర్కొన్నారు. ఒకరి నుంచి మరొకరు కొత్త విషయాలను నేర్చుకోవచ్చని సూచించారు. సంస్థ ఉద్యోగులు ప్రధాన నగరాలైన పుగెట్ సౌండ్, వర్జీనియా, నాష్‌విల్లే సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డజన్ల కొద్ది కార్పొరేట్ కార్యాలయాలకు వస్తే ఆర్థిక వ్యవస్థలతో పాటు వ్యాపారానికి ఊతమిచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు జెస్సీ. కోవిడ్-19 విజృంభించిన క్రమంలో ఇంటి నుంచే పని చేసేందుకు చాలా కంపెనీలు త ఉద్యోగులకు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. గత నెలలో స్టార్‌బక్స్ కూడా తమ ఉద్యోగుల్ని వారంలో కనీసం మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి పని చేయాలని సూచించింది. ప్రముఖ సంస్థ డిస్నీ సైతం మార్చి నుంచి 4 రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు సమాచారమిచ్చింది. వాల్ మార్ట్ సైతం టెక్ బృందాలను క్రమంలో ఆఫీసులకు రప్పించే ప్రణాళికలు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.