నూతన సంవత్సర వేడుకలకు నిబంధనలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మరో పది రోజుల్లో కొత్త ఏడాది పలుకరించబోతుంది. సం బరాలకు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. యువతీయువకులను ఆకట్టుకునేం దుకు సరికొత్త థీమ్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గ్రేటర్‌ పరిధిలో కొన్ని రిసా ర్ట్స్‌, ఫామ్‌హౌస్‌లు, పబ్‌ల్లో డ్రగ్స్‌ పార్టీలు ఏర్పాటుచేసి పోలీసులకు చిక్కిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పోలీసు కమిషనరేట్లలో యంత్రాంగం అప్రమత్తమైంది. మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తనిఖీలు ముమ్మరంచేశాయి. ఈ నెల 31 రాత్రి కొత్త సంవత్సర వేడుకలు నిర్వ హించే హోటళ్లు, పబ్‌లు, స్టార్‌ హోటళ్లు, క్లబ్బులు,  ఈవెంట్‌ సంస్థలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇవి పాటించాల్సిందేఃత్రి స్టార్‌, ఆపై హోటళ్లు, క్లబ్బులు, బార్‌, రెస్టారెంట్లు/పబ్‌లు 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు మా త్రమే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.10రోజులకు ముందే నగర పోలీసుల, సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలి.ఉత్సవాల ప్రదేశాల్లో, లోపల/బయటకు వెళ్లే మార్గాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.సరిపడినంత భద్రతా సిబ్బంది, ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లుండాలి.సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అసభ్య, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు.సంగీతం, శబ్దం 45 డెసిబుల్స్‌ మించకూడదు.బాణసంచా, పేలుడు పదార్థాలకు అనుమతి లేదు.వేడుకల్లో నిషేధిత మాదకద్రవ్యాలను అనుమతించే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.మోతాదు మించితే కేసువాహనాలు నడిపేప్పుడు రక్తంలో మద్యం నిర్ణీత మోతాదు మించితే కేసు నమోదు చేస్తారు. రూ.10,000 జరిమానా/6నెలల జైలుశిక్ష విధించవచ్చు.సురక్షితంగా ఇల్లు చేరేందుకు ‘డిజైన్డ్‌ డ్రైవర్‌ ఫర్‌ ఏ డే’ సహాయకులను ఉపయోగించుకోవాలి

Leave A Reply

Your email address will not be published.