అను యుద్ధానికి సిద్ధమైన రష్యా

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: అణు యుద్ధానికి రష్యా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడిరచారు. సైనికపరంగానే కాకుండా సాంకేతికపరంగానూ అణు యుద్ధానికి సిద్ధమని, అయితే అందుకు కొన్ని విధివిధానాలు ఉన్నాయని చెప్పారు. అణు యుద్ధం విషయంలో ఎలాంటి తొందరపాటు లేదని చెప్పారు. పాశ్చాత్య దేశాలు రష్యాను ఓడిరచలేవని, ఇందుకోసం విఫల ప్రయత్నాలు చేయాలని దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడాన్ని అమెరికా ఆపకపోతే పరిస్థితి మరింత జఠిలం కావచ్చని హెచ్చరించారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై చర్చలకు సానుకూలమని తెలిపారు. మీ దళాలను ఉక్రెయిన్‌కు పంపవద్దని అమెరికాకు తేల్చిచెప్పారు. బలగాలను పంపితే ఘర్షణను కాకలుదువ్వుతున్నట్లు పరిగణిస్తామని స్పష్టంచేశారు. ఈనెల 1517 తేదీల్లో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా అధ్యక్ష పీఠాన్ని పుతిన్‌ అధీష్టిస్తారని, ఆరవసారి బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. ఇదే క్రమంలో పుతిన్‌ బుధవారం రొస్సియా1 టీవీ, వార్తాసంస్థ ఆర్‌ఐఏకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అణు యుద్ధానికి రష్యా సర్వసన్నద్ధంగా ఉన్నదన్నారు. మిలటరీ నుంచి టెక్నికల్‌ పాయింట్‌ వరకు అంతా సిద్ధమన్నారు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు ప్రయోగించాల్సిన అవసరం రాలేదన్నారు. తమ దళాలను రష్యా భూభాగానికి లేక ఉక్రెయిన్‌కు పంపితే దానిని కవ్వింపు చర్యగా రష్యా పరిగణిస్తుందని అమెరికా గ్రహించిందని చెప్పారు. రష్యా`అమెరికా సంబంధాలు… వ్యూహాత్మక ప్రతిఘటన రంగాల్లో నిపుణులు అమెరికాకు సరిపడ ఉన్నారన్నారు. అణు యుద్ధం కోసం తొందరపడటం లేదన్నారు. ఆయుధాలు ఉండేది ప్రయోగించడం కోసమే అని పుతిన్‌ చమత్కరించారు. ఉక్రెయిన్‌ విషయంలో వాస్తవాధారిత చర్చలకు సిద్ధమని ఆయన తెలిపారు. తాను ఎవరినీ నమ్మనని, రాజీ జరగాలంటే రాతపూర్వక హామీలు అవసరమన్నారు.

Leave A Reply

Your email address will not be published.