సిసీ రోడ్డు పనులు ప్రారంభించిన సభాపతి పోచారం

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో 44 లక్షల రూపాయలతో నిర్మించనున్న మురికి కాలువలు సిసీ  రోడ్డు పనులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రైతులు పెద్ద ఎత్తున వరి పంటలు పండిస్తున్నారని అన్నారు దేశంలోని పలు రాష్ట్రాలలో కరువు పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం దేశంలోని పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడాన్ని కేంద్రం అభ్యంతరం చెబుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.