అభివృద్ధిలో ఆదర్శంగా సనత్ నగర్ నియోజకవర్గం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గం ఆదర్శంగా  నిలుస్తుందని  రాష్ట్ర పశుసంవర్ధకమత్స్యపాడి పరిశ్రమల అభివృద్ధిసినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా సనత్ నగర్ డివిజన్ లోని శ్రీరాం నగర్ లో 1.92 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు నిర్మాణ పనులనుబాలయ్య నగర్ లో 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్, 7 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. అదేవిధంగా మాతా టెంట్ హౌస్ వద్ద 39 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్ పనులుదాసారం బస్తీ లో 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులనునాగారాజేశ్వరి నగర్ లో 22.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ లైన్ పనులుసనత నగర్ మెయిన్ రోడ్ పై 64 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న డివైడర్స్ నిర్మాణ పనులను టయోటా షో రూమ్ వద్ద  ప్రారంభించారు. లింగయ్య నగర్ లో 13 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కోలన్ లక్ష్మి బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.