సనాతన ధర్మం ఒకటే మతం .. మిగిలినవన్నీ వర్గాలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తమిళనాడు మంత్రిడీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలతో సనాతన ధర్మం అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సనాతన ధర్మంపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం ఒక్కటే మతమనిమిగతావన్నీ వర్గాలుపూజా విధానాలేనని అన్నారు.గోరఖ్‌ నాథ్‌ ఆలయం లో ఏడు రోజుల పాటు జరిగిన శ్రీమద్‌ భాగవత్ కథా జ్ఞాన యాగం ముగింపు కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘సనాతన ధర్మం ఒక్కటే మతం. మిగిలినవి అన్నీ వర్గాలుపూజా విధానాలు. సనాతన ధర్మం మానవత్వం అనే మతం. దానిపై దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి సంక్షోభం’ అని వ్యాఖ్యానించారు. యోగి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.